dcsimg

పక్షి మారువేషంలో నిపుణులు ది ఇండియన్ నైట్జార్ 22

Image of Caprimulgus Linnaeus 1758

Description:

సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎంత పెరిగినా, ప్రకృతి మలుచుకున్న ఒక అద్భుతమైన పక్షి గురించి తెలిస్తే మీరు ఔరా అనాల్సిందే. పక్షి మారువేషంలో నిపుణులు: ది ఇండియన్ నైట్జార్ ఇండియన్ నైట్జార్ (కాప్రిముల్గు సాసియాటికస్) భారతదేశం అంతటా కనిపించే ఒక సాధారణ పక్షి. ఇది గోధుమ రంగులో అరచేతి పరిమాణంలో, రంగురంగుల బూడిద-గోధుమ రంగు ఈకలతో, ఒక చిన్న తోకతో ఉంటుంది. ఈ పక్షి ఎత్తైన ప్రదేశాలలో, చాలా దట్టమైన అడవులలో మాత్రమే కనిపిస్తుంది. ఈ పక్షిని మీరు కంటితో చూడడం చాలా కష్టం. ఇది ప్రకృతిలో తనకు తానుగా కలిసిపోతుంది. రాళ్ళు, చెట్లు, మట్టి ఇలా ప్రకృతిలో ఉన్న వాటి అన్నింటిలో ఇది ఇట్టే కలిసిపోతుంది. ప్రకృతిలో ఇటువంటి అరుదైన జీవరాశులకి శాస్త్రీయ పరిజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞానంతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈ 21 వ శతాబ్దంలో చూసుకుంటే మన రక్షణ బలగాలు ధరించే దుస్తులు ప్రకృతిలో కలిసిపోయే విధంగా ఉండి శత్రువులను మభ్యపెట్టేలా ఉంటాయి. అలాగే ఈ పక్షి కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిలో ఇది ఇట్టే కలిసిపోయి తన నుంచి తాను రక్షించుకుంటుంది. ఇవి ఎక్కువగా రాళ్ళలో, గుట్టలో మరియు చెట్లపై ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. ఇవి అతి సులువుగా మన కంటికి కనిపించవు. ఇవి జీవరాశులను ఎక్కడైనా గుర్తించగల నైపుణ్యం ఉన్న ఛాయాచిత్రకారులకు, అనుభవం ఉన్న జీవ శాస్త్రవేత్తలకు ఈ విలక్షణ పక్షిని గుర్తించే సామర్థ్యం ఉంటుంది. ఈ పక్షిని తెలుగులో అసకప్పిరగాడు లేదా గుండుములుపుగాడు అని పిలుస్తారు.

Source Information

license
cc-by-sa-3.0
copyright
Shiv's fotografia
original
original media file
visit source
partner site
Wikimedia Commons
ID
4e937cceb22396d584ec7a6d33cfb9e8